![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -190 లో.. ముకుంద ఫ్రెండ్ గీతిక ఇంటికి వస్తుంది. గీతికను కృష్ణ చూసి ఎలా ఉన్నావని అడుగుతుంది. ఎలాగైనా ఏసీపీ సర్ డైరీ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. నిన్నోకటి అడగాలి గీతికా? చెప్తావా అని కృష్ణ అడుగుతుంది. అడుగు కృష్ణ చెప్తానని గీతిక అనగా.. ఏసీపీ సర్ నీకు ఎప్పటి నుండి తెలుసని కృష్ణ అడుగుతుంది. ఆమ్మో ఇప్పుడు నిజం చెప్తే సిచుయేషన్ ఎలా ఉంటుందోనని అనుకున్న గీతిక.. అబద్దం చెప్పడం బెటర్ అని ముకుంద-ఆదర్శల పెళ్లి అప్పటి నుండి తెలుసని గీతికా అంటుంది. గీతిక ఏదో దాస్తున్నట్లు కృష్ణకి అనిపిస్తుంది. ఆ తర్వాత ముకుంద గదిలోకి గీతిక వెళ్తుంది.
ముకుంద గదిలోకి వెళ్ళిన గీతిక.. బయట కృష్ణతో జరిగిందంతా ముకుందకి చెప్తుంది. ఆ తర్వాత తను ఉన్న సిచువేషన్ అంతా చెప్పి.. నాకు మీ డాడ్ పొలిటికల్ సపోర్ట్ కావాలి గీతిక అని ముకుంద అంటుంది. ముకుంద ఏం చెయ్యాలనుకుంటుందో గీతికకి చెప్తుంది. మరొక వైపు మురారి, రేవతి తనతో మొదటి నుంచి చేయించిన పనులను బోర్డుపై రాస్తుంది కృష్ణ. అప్పుడే రేవతి వచ్చి ఆ బోర్డు పై లవ్ సింబల్ వేస్తుంది. మిమ్మల్ని కొన్ని రోజులు ఇంటి నుండి బహిష్కరిస్తున్నానని రేవతి అనగానే.. కృష్ణ మురారి లు షాక్ అవుతారు. మిమ్మల్ని వారం రోజులు బయటకు పంపిస్తున్నాను. మన ఫామ్ హౌస్ కి వెళ్ళండి. రేపే మీ ప్రయాణం. ఇక మీరేం మాట్లాడొద్దని రేవతి చెప్పేసి వెళ్తుంది. రేవతి మాటలను అలేఖ్య, మధు ఇద్దరు వింటారు. ఆ తర్వాత గీతిక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ముకుంద హెల్ప్ గురించి చెప్తుంది. తప్పకుండా ముకుందకి హెల్ప్ చేస్తాను.. టెన్షన్ పడకని చెప్పని గీతిక వాళ్ళ నాన్న చెప్తాడు. ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి ముకుంద దగ్గర నుండి గీతిక వెళ్ళిపోతుంది.
మరొక వైపు కృష్ణ, మురారిలను కలపడానికి రేవతి అత్తయ్య వాళ్ళని ఫామ్ హౌస్ కి పంపిస్తుందని అలేఖ్య మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. అది ముకుంద వింటుంది. కృష్ణ మురారీల బంధం శాశ్వతం చేయడానికి రేవతి అత్తయ్య విశ్వప్రయత్నలు చేస్తుందని ముకుంద అనుకుంటుంది. ఇది ఆట ఆడడానికి చదరంగం కాదు.. రణరంగం ఎలాగైనా మురారిని దక్కించుకుంటానని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు రేవతి అన్న మాటలు గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |